పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ గోశామహల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర సీపీ అంజనీ కుమార్ శిబిరాన్ని ప్రారంభించారు. గోశామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందకుపైగా పోలీసు అధికారులు రక్తదానం చేశారు.
పోలీసుల సేవలు అజరామరం: సీపీ అంజనీ కుమార్ - Hyderabad cp anjani kumar
పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారమంతా హైదరాబాద్ నగర పోలీసులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీపీ అంజనీ కుమార్ తెలిపారు. గోశామహల్ ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
గోశామహల్లో రక్తదాన శిబిరం.
అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వారమంతా సిటీ పోలీసులు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు సీపీ తెలిపారు. బుధవారం రోజు గోశామహల్ మైదానంలో జరగనున్న పెరేడ్లో హోంమంత్రి పాల్గొననున్నట్లు వెల్లడించారు. రక్తదాన శిబిరం ఏర్పాటుకు సహకరించిన నిలోఫర్ ఆసుపత్రి సిబ్బందికి అంజనీ కుమార్ ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్, ట్రాఫిక్ డీసీపీ చౌహాన్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.