గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో 50 మంది పోలీసులు రక్తదానం చేశారు. సైబరాబాద్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్, తలసేమియా సొసైటీ సంయుక్తంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా ప్రభావంతో బ్లడ్ బ్యాంకుల వద్ద రక్త నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి.
రక్తదానం చేసిన 50 మంది పోలీసులు - రక్తదాన కార్యక్రమం
గచ్చిబౌలి సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, తలసేమియా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 50 మంది పోలీసులు రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన 50 మంది పోలీసులు
తలసేమియా రోగులకు, డయాలసిస్, క్యాన్సర్ రోగులకు తగినంత రక్తం లభించడం లేదని, ప్రజలు సేవా దృక్పథంతో ముందుకు రావాలని పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏడీసీపీ మాణిక్‌రాజ్, ఆర్ఐ విష్ణు, ఆర్ఐ శ్రీనివాస్, ఉస్మానియా జనరల్ ఆస్పత్రి డాక్టర్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రేపు ఉదయం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు