హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కేపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు పోలీస్ అధికారులతో పాటు స్థానికులు పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 188 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
తలసేమియా రోగుల కోసం కేపీహెచ్బీ పోలీసుల రక్తదానం - hyderabad news
తలసేమియా రోగుల కోసం హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీసులు రక్తదానం చేశారు. కేపీహెచ్బీ కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పోలీసులు, స్థానికులు పాల్గొని రక్తదానం చేశారు. మొత్తం 188 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.
BLOOD DONATION CAMP HELD ON KPHB COLONY
ఈ మొత్తాన్ని తలసేమియాతో బాధపడుతున్న రోగులకు అందించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, కూకట్పల్లి ఏసీపీ సురేందర్రావు, కేపీహెచ్బీ సీఐడీ లక్ష్మీనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.