తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం చేసిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు - TRS Blood Donation Camp

తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంపీ సంతోశ్​కుమార్​, ఎక్సైజ్​శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ తోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు. హైదరాబాద్​ బంజారాహిల్స్​లో ఎమ్మెల్యే దానం నాగేందర్​ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

తెరాస రక్తదాన శిబిరం
తెరాస రక్తదాన శిబిరం

By

Published : Apr 28, 2020, 12:12 AM IST

Updated : Apr 28, 2020, 2:11 PM IST

​హైదరాబాద్ బంజారాహిల్స్​లోని ఓ ఫంక్షన్ హాల్​లో తెరాస 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఎంపీ సంతోశ్​ కుమార్, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దానం నాగేందర్​, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరై రక్తదానం చేశారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం దేశంలోనే అత్యుత్తమ నీటిపారుదల ప్రాజెక్టులను కేసీఆర్​ నిర్మించారని వారన్నారు. రైతులకు సాగునీరు అందిస్తూ నీటికష్టాలు తొలగించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.

రక్తదానం చేసిన ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలు

ఇవీచూడండి:తెరాస రాష్ట్ర కార్యాలయంలో రక్తదాన శిబిరం

Last Updated : Apr 28, 2020, 2:11 PM IST

ABOUT THE AUTHOR

...view details