చిన్నప్పటి నుంచి పుట్టుగుడ్డి కావడం వల్ల ప్రపంచాన్ని చూడలేకపోయింది. కానీ ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ దివ్యజ్ఞానంతో ప్రపంచాన్ని చూస్తోంది. పుట్టుకతో దృష్టిలోపం ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి బ్రెయిలీ లిపిలో ఖురాన్ నేర్చుకుంది. హైదరాబాద్ ఆజంపురాలోని ఐడియల్ స్కూల్లో చేరి బ్రెయిలీ ఖురాన్ చదడంలో తర్ఫీదు పొందింది ఫిర్దౌస్ బేగం. ఆ పాఠశాలలో అర్షియా ఉన్నిసా అనే అంధ ఉపాధ్యాయురాలు ఎంతోమంది చూపులేని బాలికలకు పవిత్ర గ్రంథం చదవడం నేర్పుతున్నారు. దీంతో అంధులు కూడా ఖురాన్ సులువుగా పఠిస్తున్నారు.
బ్రెయిలీ లిపితో ఖురాన్ అవపోసన - బ్రెయిలీ లిపితో ఖురాన్ అవపోసన హైదరాబాద్
ఆ చిన్నారికి చూపు లేదు. కానీ ముందు చూపుందు. కళ్లల్లో కాంతి లేకపోయినా దివ్యకాంతితో ముందుకెళుతుంది. అంధత్వం కళ్లకే కానీ మనసుకు కాదంటోంది. పుట్టుగుడ్డి అయినప్పటికీ అరబీ ఖురాన్ గ్రంథాన్ని ఎంతో శ్రావ్యంగా చదువుతోంది హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఫిర్దౌస్ బేగం.
బ్రెయిలీ లిపితో ఖురాన్ అవపోసన
ఖురాన్ నేర్చుకోవాలంటే అంత సులువైన విషయం కాదు. ఖురాన్ గ్రంథంలోని 6 వేల 323 వచనాలను చదవడం నేర్చుకోవాలంటే ఎంతో కష్టపడాలి. నూరానీ ఖాయిదాలోని 28 పాఠ్యాంశాలను అవపోసన పట్టాలి. పదాల ఉచ్ఛారణ నేర్చుకోవాలి. శ్రావ్యంగా ఉచ్ఛరించడాన్నే ‘ఖిరాత్’ అంటారు. ఎంతో పట్టుదలతో ఖురాన్ నేర్చుకుని చక్కని ఖిరాత్తో పలుకుతుంది ఫిర్దౌస్ బేగం.