సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో పేలుడు సంభవించింది. మైలాన్ పరిశ్రమ యూనిట్లో అర్ధరాత్రి డ్రైయర్ పేలింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు గాయపడగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు తొలుత సూరారం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి... ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
గడ్డపోతారం మైలాన్ పరిశ్రమలో పేలుడు.. ఐదుగురికి గాయాలు - పరిశ్రమలో పేలుడు
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని మైలాన్ పరిశ్రమలో అర్ధరాత్రి పేలుడు జరిగింది. ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి.
గడ్డపోతారం మైలాన్ పరిశ్రమలో పేలుడు.. ఐగురికి గాయాలు