వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మధుమేహుల్లో ఎక్కువ ప్రభావం చూపుతోంది. గడిచిన రెండు నెలల్లో నగరంలోని ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రిలో పదుల సంఖ్యలో బాధితులు ఈ సమస్యతో చేరారు. శస్త్ర చికిత్సలతో కొందరిలో అడ్డుకట్ట వేయగా, మరికొందరిలో ప్రమాదకరంగా మారింది. తాజాగా మూసాపేటలోని ఓ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్‌తో చేరిన 25, 42, 63 ఏళ్ల ముగ్గురు వ్యక్తులకు వైద్యులు శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ సమస్యతో బాధితులు చేరుతున్నారు. లక్షణాలు కన్పించిన వెంటనే ఆలస్యం చేయకుండా ఈఎన్‌టీ, దంత, నేత్ర వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కేసులు పెరుగుతున్నాయి:
బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా వరకు కొవిడ్ లక్షణాలే కనిపిస్తాయి. తొలుత ముక్కులో కనిపిస్తుంది. క్రమంగా కళ్లు అక్కడి నుంచి మెదడుకు వ్యాపిస్తుంది. ఇది చాలా అరుదైనది. కరోనా బారిన పడి అధిక మోతాదులో స్టెరాయిడ్లు వాడిన వారికి బ్లాక్ ఫంగస్‌తో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది. ముగ్గురు బాధితులు ఇటీవల ఈ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. వెంటనే శస్త్ర చికిత్సతో ప్రాణాలు కాపాడాం. - డాక్టర్ భార్గవ్ ఇలపకుర్తి; తల, మెడ శస్త్రచికిత్స నిపుణులు
నేత్రాలకు పెను ప్రమాదం