తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసులు.. జిల్లాలో 100 మందికి చికిత్స..! - 100 black fungus cases in guntur district

ఏపీలోని గుంటూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎక్కువ శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నందున ప్రభుత్వ రికార్డుల్లోకి అవి రావడం లేదని తెలుస్తోంది. సరైన మందులు లేక చికిత్స ఆలస్యమవుతున్నట్లు వైద్యులు అంటున్నారు.

BLOCK FUNGUS
బ్లాక్‌ ఫంగస్‌ కేసులు

By

Published : May 18, 2021, 8:55 PM IST

ఆంధ్రప్రదేశ్​లో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. గుంటూరు జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో సుమారు 100 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మంగళగిరి సమీపంలోని ఓ కార్పొరేటు ఆస్పత్రిలో ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. మ్యుకర్‌మైకోసిస్‌ వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నందున అవి అధికారిక రికార్డుల్లోకి ఎక్కడం లేదు. చాలామందికి ఇప్పటికే శస్త్రచికిత్సలు చేసినట్లు ఈఎన్‌టీ వైద్యులు చెబుతున్నారు.

గుంటూరుకు చెందిన ఈఎన్‌టీ సర్జన్‌ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ఈ వారంలోనే బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 40 వరకు వచ్చాయని, రోజుకు కనీసం నలుగురికి సర్జరీలు చేస్తున్నామని చెప్పారు. మందుల కొరతతో ఎక్కువ మందికి శస్త్రచికిత్సలు చేయలేకపోతున్నామని ఆయన తెలిపారు. సరైన అవగాహన లేక ఆలస్యంగా వస్తున్నవారిలో కంటిని తొలగించాల్సి వస్తోందని వివరించారు.

మార్కాపురంలో అయిదుగురికి..

ప్రకాశం జిల్లా మార్కాపురంలో 5 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడ్డాయి. గత నెల రోజుల వ్యవధిలో వీరిలో ఈ లక్షణాలు గుర్తించినట్లు మార్కాపురం జిల్లా వైద్యశాల డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాహుల్‌ తెలిపారు. ఇద్దరు జిల్లా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, మరో ఇద్దరు గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్నారు. ఇంకొకరు నంద్యాలలో చికిత్స తీసుకొని ఇంటికి చేరుకున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 3,982 కరోనా కేసులు, 27 మరణాలు

ABOUT THE AUTHOR

...view details