పలు జఠిలమైన సమస్యలకు సులువైన పరిష్కారాలు కనుగొనే బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగం.. ప్రభుత్వ విభాగాల్లోనూ పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్త్రీ నిధి లావాదేవీల పరిరక్షణకు ఉద్దేశించిన బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడకాన్ని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, పంచాయతీ రాజ్ అండ్ డెవలప్ మెంట్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్త్రీ నిధి డైరెక్టర్‌తో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్‌కు చెందిన కాగ్నిటోచైన్ సంస్థ అభివృద్ధి చేసిన ఈ టెక్నాలజీ అమలుకు రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న పేద మహిళలకు, అండర్ బ్యాంక్ జనాభాకు ఈ టెక్నాలజీ ద్వారా సాధికారత లభిస్తుందని జయేశ్ తెలిపారు.