తెలంగాణ

telangana

ETV Bharat / state

BJYM RALLY: హుజురాబాద్ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ... నిరుద్యోగులపై లేదా?

ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ జేఎన్​టీయూ నుంచి కూకట్​పల్లి వైపు బీజేవైఎం కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదంటూ... పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురిని అరెస్ట్ చేసి కేపీహెచ్‌బీ పీఎస్‌కు తరలించారు.

BJYM RALLY
బీజేవైఎం కార్యకర్తల ర్యాలీ

By

Published : Aug 5, 2021, 2:58 PM IST

భారతీయ జనతా యువ మోర్చా తలపెట్టిన ఛలో ప్రగతి భవన్ ద్విచక్ర వాహన ర్యాలీ అరెస్టులకు దారి తీసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలంటూ... ప్రగతిభవన్ వరకు ర్యాలీ చేపట్టారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లేనిపక్షంలో నిరసనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎల్బీనగర్‌లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టారు.

బీజేవైఎం కార్యకర్తల ర్యాలీ

అనుమతి లేదంటూ..

బైక్‌ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించి ఎల్బీనగర్ రింగ్ రోడ్‌ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మొహరించారు. ఒక్కసారిగా హస్తినాపురం కూడలి రహదారిపైకి సుమారు 100 మంది బీజేవైఎం కార్యకర్తలు, నాయకులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ప్రగతిభవన్ ముట్టడి

భాజపా రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రగతిభవన్‌ ముట్టడికి బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు ప్రగతిభవన్‌ వద్ధ రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్‌తో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే వరకు... నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. హుజురాబాద్ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ... కేసీఆర్‌కు నిరుద్యోగులపై ఎందుకు లేదని బీజేవైఎం నాయకులు ప్రశ్నించారు.

ఇదీ చూడండి:జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా?: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details