కరోనా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ.. పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు మలక్‌పేట యశోద ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. హాస్పిటల్‌ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
'కరోనా పేరుతో పేద ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు' - యశోద ఆసుపత్రి ముందు బీజేవైఎం ధర్నా
కరోనా పేరుతో అక్రమ వ్యాపారం చేస్తూ.. పేద ప్రజలను దోచుకుంటున్నారని ఆరోపిస్తూ బీజేవైఎం నాయకులు మలక్‌పేట యశోద ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు.
'కరోనా పేరుతో పేద ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారు'
కొవిడ్ నిబంధనలకు విరుద్దంగా చట్టాలను అతిక్రమించి కరోనా రోగుల నుంచి రూ. 15 నుంచి 50లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటు ఆసుపత్రులతో కలిసి ప్రభుత్వం... ప్రజల రక్తాన్ని పీల్చుతోందని బీజేవైఎం నేత భాస్కర్ మండిపడ్డారు.