ప్రైవేటు మెడికల్ కళాశాలల అక్రమాలను, ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా హైదరాబాద్ కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగింది. నెలనెలా ఉపకార వేతనాలు ఇవ్వకుండా... అక్రమంగా వైద్య విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ప్రైవేటు కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు. పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో కార్యాలయం లోపలికి వెళ్లడానికి యత్నించారు.
ప్రైవేటు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి: బీజేవైఎం
ప్రైవేటు మెడికల్ కళాశాలల అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. చాలా కాలేజీల్లో ప్రమాణాలకు తగిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేరని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోఠిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ఎదుట ధర్నాకి దిగారు.
ప్రైవేటు మెడికల్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి: బీజేవైఎం
చాలా కళాశాలల్లో ప్రమాణాలకు తగిన మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేరని... వీటిని ప్రశ్నించిన విద్యార్థులపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మోర్చా నాయకులు ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేటు కళాశాలలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని... లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఉపరాష్ట్రపతి దాతృత్వం: యువతి శస్త్రచికిత్సకు సాయం