తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రైవేటు ఆసుపత్రుల తీరుకు నిరసనగా యశోద వద్ద బీజేవైఎం నాయకుల ధర్నా - బీజేవైఎం నాయకుల ధర్నా

కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులు.. పేద ప్రజల వద్ద అధిక డబ్బులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో సికింద్రాబాద్​ యశోద ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. కొవిడ్​వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలంటూ వారు డిమాండ్​ చేశారు.

bjym leaders protest at yashoda hospital in secunderabad
యశోద ఆసుపత్రి ఎదుట బీజేవైఎం నాయకుల ధర్నా

By

Published : Aug 9, 2020, 11:57 AM IST

సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు ప్రైవేట్ దవాఖానాల తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించకుండా కార్పొరేట్ ఆసుపత్రులకు లాభం చేకూర్చేలా ప్రభుత్వం వ్యవహరించడం సరైన చర్య కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా చికిత్స కోసం వచ్చే పేద ప్రజల వద్ద ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తూ ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు.

కరోనా చికిత్సను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మారకుంటే రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా నిర్వహిస్తున్న బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి గాంధీనగర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details