హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయం(Excise office) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం నోటిఫికేషన్లు కాదని... ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇవ్వాలని భాజపా యువ మోర్చా (BJP Yuva Morcha) నేతలు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. గేటు బయట బైఠాయించారు.
BJP Yuva Morcha: అబ్కారీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత... బీజేవైఎం ఆందోళన
హైదరాబాద్ నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయం (Excise office) వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ భాజపా యువ మోర్చా (BJP Yuva Morcha) కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
బీజేవైఎం(BJYM) రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ ఆధ్వర్యంలో... అబ్కారీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు కార్యకర్తలను అడ్డుకుని బలవంతంగా వాహనాల్లో బేగంపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కంటి తుడుపు చర్యగా కేవలం 50 వేల పోస్టులను భర్తీ చేసి... సీఎం కేసీఆర్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని భానుప్రకాశ్ మండిపడ్డారు. తక్షణమే ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:KCR fires on Central Government : ' కేంద్రం భయపెడితే కేసీఆర్ భయపడతాడా..? '