తెలంగాణ

telangana

ETV Bharat / state

Bjym: భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో అన్నదానం - బీజేవైఎం అన్నదానం

కేంద్రంలో భాజపా రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా... ఆ పార్టీ శ్రేణులు హైదరాబాద్​లో పేదలకు అన్నదానం, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. భారతీయ యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నితిన్ నందేకర్ ఆధ్వర్యంలో... నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ముందు పేదలకు ఆహార ప్యాకెట్లను అందజేశారు.

Bjym: భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో అన్నదానం
Bjym: భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో అన్నదానం

By

Published : May 30, 2021, 4:06 PM IST

యువ మోర్చా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నితిన్ నందేకర్ ఆధ్వర్యంలో... నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్ ముందు పేదలకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. కేంద్రంలో భాజపా రెండోసారి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా... అన్నదానం, నిత్యావసర సరకులను పంపిణీ చేశామని తెలిపారు.

దేశంలోని ప్రతి పౌరున్ని ఆదుకోవాలన్న ప్రధాని మోదీ పిలుపు మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సేవాహీ సంఘటన్ పేరుతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి... ఆస్పత్రుల్లో వ్యాక్సిన్, అడ్మిషన్ తదితర సేవలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా తగ్గేవరకు ప్రజలందరు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇదీ చదవండి:Water Bills: నల్లాదారులపై బిల్లుల భారం.. సర్వీసు ఛార్జీలతో బాదుడు

ABOUT THE AUTHOR

...view details