లాక్డౌన్ కారణంగా ఉపాధి కరవై అవస్థలు పడుతున్న పేదల పట్ల అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ హైదరాబాద్ బీజేవైఎం కార్యదర్శి ప్రవీణ్ అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లకు వారం రోజులకు సరిపడ బియ్యం, వంటనూనె ఇతర నిత్యావసర సరుకులను అందజేశారు.
పేదల అవస్థల పట్ల దాతలు స్పందించాలి: బీజేవైఎం - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ నగరంలోని ఆటో డ్రైవర్లకు బీజేవైఎం అండగా నిలిచింది. వారం రోజులకు సరిపడ నిత్యావసర సరుకులను బీజేవైఎం నాయకులు పంపిణీ చేశారు. లాక్డౌన్తో ఉపాధి కరవై అవస్థలు పడుతున్న పేదల పట్ల దాతలు స్పందించాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ, హైదరాబాద్ బీజేవైఎం
సమాజంలోని పేదల జీవనం దుర్భరంగా మారే ప్రమాదాన్ని దాతలు గ్రహించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఉపాధి కోల్పోయి ఆటో డ్రైవర్లు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆయన అన్నారు.