తెలంగాణ

telangana

ETV Bharat / state

BJYM Clashes in Hyderabad : బీజేపీలో అంతర్గత ముసలం.. బీజేవైఎం యువమోర్చా సమావేశం రసాభాస - Tarunchug

BJYM Clashes in Hyderabad : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యువ మోర్చా మీడియా కార్యశాల, ఎన్నికల సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్​ లేకుండానే సమావేశం ప్రారంభించడం వివాదానికి కారణమైంది. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, తరుణ్ చుగ్‌ ముందే భాను ప్రకాష్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది.

Political Clashes in BJP
BJYM Clashes in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 3:43 PM IST

Updated : Oct 12, 2023, 5:36 PM IST

BJYM Clashes in Hyderabad : ఎన్నికల వేళ బీజేపీకి కొత్త తల నొప్పి పట్టుకుంది.బీజేపీ(Telangana BJP) యువ మోర్చా రెండు వర్గాలుగా చీలింది. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ వర్సెస్ జాతీయ కోశాధికారి సాయి రెండు వర్గాలుగా విడిపోయారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. బీజేవైఎం మీడియా కార్యాశాల, ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

BJP Telangana Election Committees 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా.. బీజేపీ 14 కమిటీలు

Political Clashes in BJP : ముఖ్య అతిథిగా వచ్చిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య.. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన విడిదిలో బస చేయకుండా సాయితో వెళ్లాడని తప్పు పడుతున్నారు. ఓకే వర్గానికి కొమ్ము కాసే విధంగా తేజస్వి సూర్య వ్యహరిస్తున్నారని భాను ప్రకాష్ వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికే బీజేపీ కార్యాలయనికి చేరుకున్న తేజస్వి సూర్య.. తాను వర్క్​షాప్​కి హాజరుకానంటూ భాను ప్రకాష్​కి కాల్​ చేసిన అనంతరం.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. భాను ప్రకాశ్​ను బుజ్జగించేందుకు మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాశం వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి సద్దిమణిగించే ప్రయత్నం చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను, జాతీయ కోశాధికారి సాయి మల్కాజిగిరి టికెట్ ఆశిస్తున్నారు.

Telangana Assembly Elections 2023 :మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన నేతల అసంతృప్తి.. అధిష్ఠానానికి ఇదో సమస్యగా మారింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ నేతల మధ్య ఐక్యత లోపిస్తే అది పార్టీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుందని అగ్రనాయకులు ఆందోళన చెందుతున్నారు. పార్టీ నాయకులను ఐక్య పరిచేందుకు అధిష్ఠానం ఒక్కొక్కరితో చర్చలు జరిపింది. బీఆర్​ఎస్​ను ఓడించేందుకు.. పార్టీలో చేరిన నాయకులకు.. ప్రాధాన్యత విషయంలో సంతృప్తిగా లేరని తెలుస్తోంది. దీనిపై ఘట్​కేసర్​లో నిర్వహించిన సభకు వచ్చిన జేపీ నడ్డాతో వారితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

ఎన్నికల షెడ్యూల్​కు ముందే.. అగ్ర నేతలతో ఒక దఫా ప్రచారం చేయాలని (BJP Campaign) కమలం పార్టీ నాయకులు భావించారు. మొదటి దఫా ప్రచారంలో భాగంగా మూడు రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీని రెండు సార్లు రాష్ట్రానికి రప్పించారు. పాలమూరు వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించి మోదీ.. రాష్ట్రాంలో గిరిజన యూనివర్సిటీ, పసువు బోర్టు.. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారు.నిజామాబాద్ ప్రజాగర్జన సభలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్​ఎస్, బీజేపీ పొత్తుపై కీలక వ్యాఖ్యాలు చేశారు.

BJYM Clashes in Hyderabad బీజేపీలో అంతర్గత ముసలం.. బీజేవైఎం యువమోర్చా సమావేశం రసాభాస

BJP Telangana Election Committee 2023 : ఎన్నికల కోసం.. 26 మందితో బీజేపీ ప్రత్యేక కమిటీ

BJP MP Laxman Fires on KTR : "కేటీఆర్​ స్థాయికి మించి మాట్లాడుతున్నారు"

Last Updated : Oct 12, 2023, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details