బషీర్బాగ్లో బీజేవైఎం నాయకుల సంబురాలు - bjym
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ రెండోసారి ప్రమాణస్వీకారం సందర్భంగా హైదరాబాద్లోని బషీర్ బాగ్లో బీజేవైఎం సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు.
సంబురాలు
నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా రెండో సారి ప్రమాస్వీకారం చేసిన సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా నాయకులు సంబురాలు చేసుకున్నారు. హైదరాబాద్లోని బషీర్ బాగ్ కూడలిలో నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచుకుంటూ టపాసులు పేల్చారు. టపాసులు పేల్చుతుండగా కూడలిలో ఉన్న చెట్టుకు అంటుకోవడంతో చెట్టు కాలిపోయింది.