తెలంగాణ

telangana

ETV Bharat / state

టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ఫర్నిచర్​ ధ్వంసం.. బీజేవైఎం ఆందోళన - tension at TSPSC office in Nampally

TSPSC
టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భాజపా యువ మోర్చా ఆందోళన

By

Published : Dec 22, 2020, 11:31 AM IST

Updated : Dec 22, 2020, 12:23 PM IST

11:30 December 22

టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ఫర్నిచర్​ ధ్వంసం.. బీజేవైఎం ఆందోళన

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భాజపా యువ మోర్చా ఆందోళన

హైదరాబాద్‌ నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ భాజపా యువ మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.  

భాజపా ప్రధాన కార్యాలయం నుంచి 400 మంది నాయకులు ర్యాలీగా బయల్దేరి నిరసన వ్యక్తం చేశారు. టీఎస్​పీఎస్సీ కార్యాలయంలోపలికి చొచ్చుకుని వెళ్లారు. అక్కడ ఉన్న ఫర్నిచర్​ ధ్వంసం చేశారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్​కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..  గేటు బయట బైఠాయించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని పరిస్థితిని చక్కదిద్దారు. కంటి తుడుపు చర్యగా కేవలం 50 వేల పోస్టులను భర్తీ చేసి... సీఎం కేసీఆర్ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్‌ మండిపడ్డారు. తక్షణమే ఖాళీగా ఉన్న ఒక లక్ష 50వేల పోస్టులను భర్తీ చేయడంతోపాటు టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు.

Last Updated : Dec 22, 2020, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details