రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను భాజపా సందర్శించనుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలోని బృందం రెండు రోజుల యాత్ర చేపట్టింది. మంగళవారం ఉదయం ఏడు గంటలకు భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద యాత్ర ప్రారంభంకానుంది.
హైదరాబాద్ నుంచి యాత్ర నేరుగా యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక చేరుకుంటుంది. అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా బైరాన్ పల్లికి వెళుతుంది. బైరాన్ పల్లి బురుజు వద్ద నివాళులు అర్పించిన తరువాత వరంగల్ గ్రామీణ జిల్లా పరకాలలోని అమరధామంను నేతలు సందర్శించనున్నారు. పరకాల నుంచి బయలుదేరి గోదావరిఖనిలో రాత్రి బస చేస్తారు.