హైదరాబాద్ మహానగర పాలకసంస్థ ఎన్నికలు కమలదళంలో సరికొత్త జోష్ నింపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న భాజపాకు బల్దియా ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అధికార తెరాసకు తామే ప్రత్యామ్నాయం అని ప్రచారానికి అనుగుణంగా గ్రేటర్ పోరులో ప్రజామద్దతును కూడగట్టుకుంది.
- ఎల్బీనగర్ సర్కిల్‌లో అన్ని డివిజన్లను భాజపా కైవసం చేసుకుంది. 13 డివిజన్లలో కమలనాథులు పాగా వేశారు.
- గోషామహల్ నియోజకవర్గంలోని 6 డివిజన్లను భాజపా గెలుచుకుంది.
గెలిచిన అభ్యర్థుల వివరాలు:
1. అడిక్‌మెట్‌లో భాజపా అభ్యర్థి సునీతా ప్రకాశ్‌గౌడ్ విజయం
2. గచ్చిబౌలిలో భాజపా అభ్యర్థి గంగాధర్ రెడ్డి విజయం
3. ముషీరాబాద్‌లో భాజపా అభ్యర్థి ఎం.సుప్రియ విజయం
4. చెతన్యపురిలో భాజపా అభ్యర్థి రంగవెంకటనర్సింహారావు గెలుపు
5. జీడిమెట్లలో భాజపా అభ్యర్థి సి.హెచ్. తారచంద్రారెడ్డి విజయం
6.మూసారంబాగ్‌లో భాజపా అభ్యర్థి బి.భాగ్యలక్ష్మి గెలుపు
7. మోండామార్కెట్‌లో భాజపా అభ్యర్థి కొంతం దీపిక గెలుపు
8. హబ్సిగూడలో భాజపా అభ్యర్థి చేతన విజయం
9. రాంనగర్‌లో భాజపా అభ్యర్థి కె.రవికుమార్ విజయం
10. వనస్థలిపురంలో భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్‌రెడ్డి విజయం
11. అమీర్‌పేటలో భాజపా అభ్యర్థి కేతినేని సరళ విజయం
12. వినాయకనగర్‌లో భాజపా అభ్యర్థి సి.రాజ్యలక్ష్మి విజయ
13. గుడిమల్కాపూర్ భాజపా అభ్యర్థి దేవర కరుణాకర్ విజయం
14. కవాడిగూడలో భాజపా అభ్యర్థి రచన విజయం
15. గడ్డిఅన్నారంలో భాజపా అభ్యర్థి ప్రేమ్ మహేశ‌్వర్ రెడ్డి విజయం
16. రామకృష్ణాపురంలో భాజపా అభ్యర్థి వి.రాధ విజయం
17. సరూర్‌నగర్‌లో భాజపా అభ్యర్థి ఆకుల శ్రీవాణి విజయం
18. హస్తినాపురంలో భాజపా అభ్యర్థి బానోత్ సుజాత విజయం
19. రామంతాపూర్ భాజపా అభ్యర్థి బండారి శ్రీవాణి విజయం
20. గాంధీనగర్‌లో భాజపా అభ్యర్థి ఎ.పావని విజయం
21. మల్కాజిగిరిలో భాజపా అభ్యర్థి వి.శ్రవణ్ విజయం
22. రాంగోపాల్‌పేటలో భాజపా అభ్యర్థి సుచిత్ర విజయం
23. చంపాపేటలో భాజపా అభ్యర్థి వంగ మధుసూదన్ రెడ్డి విజయం