తెలంగాణ

telangana

ETV Bharat / state

మజ్లిస్‌కు బీఆర్ఎస్ సపోర్ట్... ఎన్నికల నుంచి బీజేపీ ఔట్ - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీజేపీ ఔట్

MLC Elections 2023 in Telangana: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి బీజేపీ తప్పుకుంది. బీఆర్ఎస్, ఎం​ఐఎం​కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించటంతో బీజేపీ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

MLC Elections
MLC Elections

By

Published : Feb 23, 2023, 3:32 PM IST

MLC Elections 2023 in Telangana: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎం​ఐఎం​కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించటంతో బీజేపీ తప్పుకుంది. తొలుత ఎన్నికలకు దూరంగా ఉండాలనుకున్న బీజేపీ.. తర్వాత పోటీపై పునరాలోచనలో పడింది. మళ్లీ మారుతున్న సమీకరణాలపై దృష్టి సారించిన బీజేపీ.. ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ నుంచి ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ ఓకే నాణానికి ఉన్న గుర్తులని అర్థమైందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మజ్లిస్‌కు మద్దతు ఇవ్వడంపై ఆలోచించాలన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్‌కు మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారని వెల్లడించారు. మజ్లిస్, బీఆర్ఎస్ ఒకటేనని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయకూడదని నిర్ణయించామని తెలిపారు. ఓటర్లుగా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా పునరాలోచించాలన్నారు.

మునుగోడులో కమ్యూనిస్టుల సహకారంతో బీఆర్​ఎస్​ గట్టెక్కిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా గెలిచే అవకాశం ఉందన్న ఆయన... తొలుత పోటీకి దూరమని ప్రకటించి ఆ తరువాత మజ్లిస్‌కు మద్దతు ప్రకటించిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కలిసి వెళ్లాలనే ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. 50 స్థానాల్లో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించెందుకే ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్, కమ్యూనిస్టులు కలిసి వెళ్లాలని నిర్ణయించాయని.. ఇది అనైతికమన్నారు. పురపాలక శాఖలోని కుక్కల దాడిలో అనేక మంది చనిపోతున్నారన్న ఆయన.. నైతిక బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసమర్థ మంత్రి కేటీఆర్‌ను ముఖ్యమంత్రి అయినా తొలగించాలని సూచించారు.

ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118. అయితే ఏ పార్టీ సొంతంగా గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. ఎం​ఐఎం 52, బీఆర్ఎస్​కు 41, బీజేపీ 25 ఓట్లున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం 60 ఓట్లు రావాలి. ఇక బీజేపీ బరిలో ఉంటే ఓటింగ్‌ తప్పనిసరి అవుతుంది. అయినప్పటికీ.. బీజేపీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది. ఇదిలా ఉంటే మరోవైపు హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ పేరును మజ్లిస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మీర్జా రెహమత్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details