స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు(local bodies MLC elections) భాజపా దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్యనేతలు ఆదివారం రాత్రి టెలీకాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలపై (MLC elections in telangana) చర్చించారు. పార్టీకి జిల్లాల వారీగా ఉన్న బలాబలాల్ని విశ్లేషించారు. గెలిచే అవకాశాలు లేకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి జగదీశ్‌రెడ్డి వాడిన భాష ఆయన అహంకారానికి నిదర్శమని భాజపా రాష్ట్ర కార్యదర్శి ఎస్.ప్రకాశ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమం కోసమే తాము పోరాడుతున్నామని తెలిపారు.
తెరాస స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..
స్థానికసంస్థల కోటాలో సగం మంది అభ్యర్థులకు నిరాశే(MLC elections latest news) మిగిలింది. ఆదిలాబాద్‌లో పురాణం సతీశ్‌కు అవకాశమివ్వకుండా ఆయన స్థానంలో దండే విఠల్(trs mlc candidates list)ను ఖరారు చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కసిరెడ్డి నారాయణరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చిన కేసీఆర్...కూచిభట్ల దామోదర్ రెడ్డిని మార్చి గాయకుడు సాయిచంద్‌ను ఖరారుచేశారు. ఖమ్మంజిల్లాలో బాలసాని లక్ష్మీనారాయణ స్థానంలో తాతమధుసూదన్‌ని ఎంపికి చేశారు. నల్గొండ జిల్లాలో గతంలో ఇచ్చిన హామీ మేరకు నాగార్జున సాగర్ నేత ఎమ్సీ కోటిరెడ్డికి కేసీఆర్ అవకాశం ఇవ్వడంతో.. సిట్టింగ్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి నిరాశ మిగిలింది. మెదక్‌జిల్లాలో గజ్వేల్‌కు చెందిన వైద్యుడు, పార్టీ సీనియర్ నేత డాక్టర్ యాదవరెడ్డిని బరిలోకి దించడంతో.. మండలి ప్రస్తుత ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి అవకాశం కోల్పోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భానుప్రసాదరావుకు మరోసారి అవకాశం ఇచ్చిన తెరాస... మరో స్థానంలో సిట్టింగ్ అభ్యర్థి నారదాసు లక్ష్మణ రావు బదులుగా తెదేపా నుంచి తెరాసలో చేరిన ఎల్.రమణను బరిలోకి దించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి.... మరోసారి అవకాశం దక్కింది. నిజామాబాద్‌లో ఆకుల లలితకు అవకాశమివ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. బండ ప్రకాశ్ మండలికి నామినేషన్ వేసినందున ఆ స్థానంలో కల్వకుంట్ల కవితను.... రాజ్యసభకు పంపించే అవకాశం కనిపిస్తోంది.