రాష్ట్రంలో వరద బాధితుల సొమ్మును తెరాస నాయకులు దోచుకున్నారని మాజీ ఎంపీ, భాజపా సీనియర్ నాయకులు వివేక్ ఆరోపించారు. వరద బాధితులకు జరిగిన నష్టానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు డైరెక్ట్‌గా జన్‌ధన్ అకౌంట్లో ఆర్థిక సాయం పడుతుందని వివేక్ తెలిపారు.
తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ రావు: వివేక్ - GHMC election campaign 2020
ప్రస్తుత పరిస్థితి చూస్తే తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవని మాజీ ఎంపీ, భాజపా సీనియర్ నాయకులు వివేక్ అన్నారు. రహమత్ నగర్లో భాజపా అభ్యర్థి కొలను వెంకటేష్ తరపున ఆయన ప్రచారం చేశారు. ఈ గ్రేటర్ ఎన్నికల్లో భాజపా జెండాను ఎగుర వేస్తామని అన్నారు.
'తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ రావు'
తెరాస ఆటలు అరికట్టేందుకు ఈ ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో భాజపా మేయర్ పీఠం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రహమత్‌నగర్‌లో భాజపా అభ్యర్థి కొలను వెంకటేష్ తరపున వివేక్ ప్రచారం నిర్వహించారు.
ఇదీ చూడండి :భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేసిన అమిత్ షా