హైదరాబాద్ లంగర్‌హౌస్ ముంపు ప్రభావిత ప్రాంతాలను భాజపా నేతలు సందర్శించారు. బాధితులతో మాట్లాడి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటం వల్ల జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడి బ్రిడ్జికి ఇరు వైపులా బార్ గేట్స్ ఏర్పాటు చేయించారు.
ప్రశాంత్ నగర్ వద్ద ఉన్న చిన్న బ్రిడ్జి కారణంగా చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారుతున్నాయని నేతలు ఆరోపించారు. గత వారం రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే ప్రశాంత్ నగర్ వద్ద పెద్ద బ్రిడ్జి కట్టాలని డిమాండ్ చేశారు.