ఈ నెల 11న జరగబోయే జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని భాజపా ప్రకటించింది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నూతన కార్పొరేటర్లతో సీనియర్ నేతలు సమావేశం నిర్వహించారు. మేయర్ ఎన్నికకు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
జీహెచ్‌ఎంసీ మేయర్ పోటీకి సై అంటున్న భాజపా - జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నిక వార్తలు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికకు పోటీ చేస్తామని భాజపా ప్రకటించింది. గురువారం జరగబోయే మేయర్ ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్లతో సీనియర్ నేతలు సమావేశమయ్యారు.
జీహెచ్‌ఎంసీ మేయర్, భాజపా
గురువారం ఉదయం పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా మేయర్ ఎన్నికకు వెళ్లాలని పార్టీ సీనియర్ నాయకులు సూచించారు. ఎన్నిక రోజు పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర నాయకత్వం మార్గనిర్దేశం చేస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి:హాలియాలో కేసీఆర్ పర్యటన.. భాజపా నేతల ముందస్తు అరెస్టు