తెలంగాణ

telangana

ETV Bharat / state

35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల - BJP Third List Released

BJP Third Candidates List
BJP Third List

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 2:18 PM IST

Updated : Nov 2, 2023, 3:39 PM IST

14:14 November 02

35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల

BJP Third List Candidates : తెలంగాణలో బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. 35 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఇప్పటికే మొదటి, రెండు జాబితాల్లో కలిపి 53 మందితో లిస్టు విడుదల (BJP MLA Candidates) చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో సుదీర్ఘ కసరత్తుల తర్వాత మరికొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించింది.

నియోజకవర్గం - అభ్యర్థి

  • మంచిర్యాల-వీరబెల్లి రఘునాథ్‌
  • ఆసిఫాబాద్‌(ఎస్టీ) -అజ్మీరా ఆత్మారామ్‌ నాయక్‌
  • బోధన్‌-వద్ది మోహన్‌రెడ్డి
  • బాన్సువాడ - యెండల లక్ష్మీనారాయణ
  • నిజామాబాద్‌ రూరల్‌ - దినేష్‌ కులచారి
  • మంథని - చందుపట్ల సునీల్‌రెడ్డి
  • మెదక్‌ - పంజా విజయకుమార్‌
  • నారాయణఖేడ్ - జెనవాడే సంగప్ప
  • ఆందోల్‌ (ఎస్సీ) - బాబూమోహన్‌
  • జహీరాబాద్‌ - రామచంద్ర రాజ నరసింహా
  • ఉప్పల్‌ - ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌
  • ఎల్బీనగర్‌ - సామ రంగారెడ్డి
  • రాజేంద్రనగర్‌ - తోకల శ్రీనివాస్‌రెడ్డి
  • చేవెళ్ల (ఎస్సీ) – కె.ఎస్‌. రత్నం
  • పరిగి - భూనేటి మారుతీ కిరణ్
  • ముషీరాబాద్‌ - పూస రాజు
  • మలక్‌పేట్‌ - సంరెడ్డి సురేందర్‌రెడ్డి
  • అంబర్‌పేట్‌ - కృష్ణా యాదవ్‌
  • జూబ్లీహిల్స్ - లంకల దీపక్‌రెడ్డి
  • సనత్‌నగర్‌ - మర్రి శశిధర్‌రెడ్డి
  • సికింద్రాబాద్‌ - మేకల సారంగపాణి
  • నారాయణపేట్‌ - కె. పాండురెడ్డి
  • జడ్చర్ల - చిత్తరంజన్‌దాస్‌
  • మక్తల్‌ - జలంధర్‌రెడ్డి
  • వనపర్తి - అశ్వత్థామరెడ్డి
  • అచ్చంపేట (ఎస్సీ) – దేవని సతీష్‌ మాదిగ
  • షాద్‌నగర్‌ - అందె బాబయ్య
  • దేవరకొండ (ఎస్టీ) – కేతావత్‌ లాలూ నాయక్‌
  • హుజూర్‌నగర్‌ - చల్లా శ్రీలతారెడ్డి
  • నల్గొండ – మాదగాని శ్రీనివాసగౌడ్‌
  • ఆలేరు - పడాల శ్రీనివాస్‌
  • పరకాల – కాళీ ప్రసాదరావు
  • పినపాక (ఎస్టీ) – పోడియం బాలరాజు
  • పాలేరు - నున్న రవికుమార్‌
  • సత్తుపల్లి (ఎస్సీ) - రామలింగేశ్వరరావు

BJP Third List Candidates :తెలంగాణలో మొత్తం 119 నియోజవర్గాలకు బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఇంకా 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సింది ఉంది. ఈ పరిస్థితుల్లో ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూనే జనసేనతో ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తోంది. జనసేన 30 సీట్లు కావాలని ప్రతిపాదించగా బీజేపీ 10 సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాల్గో జాబితాలో జనసేన పోటీ చేయబోయే స్థానాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Uttarakhand Election: భాజపా తొలి జాబితా- కొందరు సిట్టింగులపై వేటు​

Telangana BJP MLA Candidate Second List : బీజేపీ రెండో జాబితా విడుదల.. మహబూబ్​నగర్​ నుంచి రేసులో..

Last Updated : Nov 2, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details