Tharun Chug comments on CM KCR: ప్రశాంత్ కిశోర్ లాంటి వారు భాజపాను ఏమీ చేయలేరని.. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. కుటుంబ రాజకీయాలు చేసే వారికే అలాంటి వారి అవసరం ఉంటుందని ఎద్దేవా చేశారు. భాజపాకు చెందిన ప్రతి కార్యకర్తకు ఎన్నికల్లో ఎలా గెలిపించాలో తెలుసని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బర్కత్‌పురాలో పార్టీ స్థానిక కార్యకర్తలు, నేతలతో సమావేశమైన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుష్టపాలనకు, రాష్ట్రాన్ని కాపాడేవారికి మధ్య పోరు జరుగుతోందని తరుణ్ చుగ్ అన్నారు. సీఎం కేసీఆర్‌ది కేవలం పొలిటికల్ టూరిజం మాత్రమేనని.. దానివల్ల భాజపాకు ఎలాంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు.
చెల్లని పైసా
"కేసీఆర్‌ది కేవలం పొలిటికల్ టూరిజం. దిల్లీలో రోజు ఎన్నో విమానాలు దిగుతాయి. కేసీఆర్ దిగడం వల్ల నష్టమేం లేదు. ఇక్కడ చెల్లని పైసా.. దిల్లీలో ఏం చేయలేదు. కేసీఆర్‌ది చెల్లని పైసా. భాజపాను ప్రశాంత్ కిశోర్ ఏమీ చేయలేరు. మాకు బూతు స్థాయి కార్యకర్తలే పీకేలు." -తరుణ్ చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి