కృష్ణా, గోదావరి నదులకు సంబంధించి రెండు బోర్డులను కేంద్రం ఏర్పాటు చేసి.. సమావేశాలకు హాజరవ్వాలని చెప్పినప్పటికీ.. సీఎం కేసీఆర్ హాజరుకాబోమని చెప్పడంపై భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చర్యలతో తెలంగాణకు అవమానమే కాకుండా.. నష్టం జరిగే ప్రమాదం ఉందని వెల్లడించారు. కృష్ణానదిపై చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ప్రభాకర్ ఆరోపించారు. దీనివల్ల తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా, గోదావరి బోర్డులు ఏర్పాటు చేసి.. సమావేశాలకు హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం చెబితే.. సీఎం కేసీఆర్ హాజరవ్వబోం అని చెప్పడం రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరుస్తుంది. ఏ సమస్య అయినా మాట్లాడుకుంటేనే పరిష్కారం అవుతుంది. ఆయన చర్యల వల్ల రైతులకు అన్యాయం జరుగుతోంది. పుష్కలంగా నీరున్నా రైతులకు కన్నీరే మిగిలింది.-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు