శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగి 12 గంటలు గడుస్తున్నా.. ఉద్యోగుల ఆచూకీ కనుక్కోలేకపోయారని తెలంగాణ సర్కార్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. విద్యుదుత్పత్తి జరుగుతున్నప్పుడు అన్ని విభాగాలు నాణ్యతతో పని చేస్తున్నాయా లేదా.. అనే ప్రధాన జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని విమర్శించారు.
'తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యమే అగ్నిప్రమాదానికి కారణం' - bandi sanjay fires on kcr
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రమాదం జరిగి 12 గంటలైనా ఉద్యోగుల ఆచూకీ కనుక్కోలేకపోయారని మండిపడ్డారు.
శ్రీశైలం అగ్నిప్రమాదంపై బండి సంజయ్ స్పందన
ఈ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సంగమేశ్వర టెండర్లు, పోతిరెడ్డిపాడు ద్వారా జల దోపిడిని కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోలేకపోయిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇప్పటికైనా ఫామ్ హౌస్ రాజకీయాలు మానుకుని.. ప్రజల క్షేమం కోసం పని చేయాలన్నారు.
- ఇదీ చూడండి :శ్రీశైలం అగ్నిప్రమాదం: ఐదుకు చేరిన మృతుల సంఖ్య