తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2021, 8:18 PM IST

ETV Bharat / state

bandi sanjay comments on cm kcr : 'రైతుల చేతుల్లో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా..?'

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చమని అడిగినందుకు ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్​ వేటాడుతారా? వెంటాడుతారా? అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు (bandi sanjay comments on cm kcr). ధాన్యం కొంటారా? కొనరా అని అడిగితే అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.

bandi sanjay
bandi sanjay

సీఎం కేసీఆర్‌ హుందతనాన్ని కాపాడుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు (bandi sanjay comments on cm kcr). సమస్యను పరిష్కరించకుండా మరో సమస్యను సృష్టించడం కేసీఆర్‌కు అలవాటేనని విమర్శించారు. తన పర్యటనలో భాగంగా... రైతులే దాడి చేశారని చెబుతున్నకేసీఆర్‌... రైతుల చేతిలో రాళ్లు, కర్రలు ఉంటాయా? చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొంటుంటే రైతులు ఎందుకు ఆత్మహత్యలు (Farmers suicides) చేసుకుంటున్నారో సీఎం చెప్పాలన్నారు. నల్గొండ, జనగామ జిల్లాల పర్యటన విజయవంతమైందన్న సంజయ్‌.... భాజపా నేతలకు సమస్యలు చెబితే ధాన్యం కొనమని బెదిరిస్తున్నారని ఆరోపించారు.

'రైతుల చేతుల్లో రాళ్లు, కోడిగుడ్లు ఉంటాయా..?'

'రాళ్లతో దాడి చేసింది వాళ్లే.. కోడిగుడ్లతో దాడి చేసింది వాళ్లే.. కార్లను ధ్వంసం చేసింది వాళ్లే.. భాజపాకు చెందిన దాదాపు 50 నుంచి 70 మంది కార్యకర్తలపై దాడులు జరిగాయి (bandi sanjay comments on cm kcr). 10 నుంచి 15 మంది కార్యకర్తల తలలు పగిలాయి. ఇవన్నీ మీడియాలో చూపిస్తున్నారని చెప్పి మీడియాపై దాడి జరిగింది. ఎవరు కొట్టారు మేం కొట్టామా..? తెరాస వాళ్లు కొట్టారా..? రైతుల చేతిలో రాడ్లు ఉంటాయా..? రైతుల చేతిలో రాళ్లు ఉంటాయా..? రైతుల చేతిలో కోడిగుడ్లు ఉంటాయా..? ఆటోల్లో రైతులు కత్తులు పట్టుకొచ్చారా..? టీవీలో చూపించారు కదా.. వాటికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే.. పోలీస్​ అధికారులు కూడా.. భాజపా ఒక కార్యక్రమం చేపడుతుంటే మమ్మల్ని అడ్డుకోవడానికి రెడీగా ఉంటున్నారు. వాళ్లను నిరోదించడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏంటి..? మీరు లా అండ్​ ఆర్డర్​ను కంట్రోల్​ చేస్తున్నారా ..? లేక లా అండ్​ ఆర్డర్​ సమస్యను తీసుకొస్తారా.'

ABOUT THE AUTHOR

...view details