Tarun chug fire on KCR: కేసీఆర్ కుటుంబ పాలన ప్రజల మన్ననలు పొందట్లేదని తరుణ్‌చుగ్ ఆరోపించారు. బంగారు తెలంగాణ కాదు.. ఆయన కుటుంబం మాత్రమే బంగారు మయమైందన్నారు. ఇప్పుడు పార్టీ పేరులో కూడా తెలంగాణ లేకుండా పోయిందని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేశారని.. వారికి ప్రజలు వీఆర్ఎస్ ఇస్తారని జోస్యం చెప్పారు. అందుకే కేసీఆర్ గుండెల్లో గుబులు పట్టుకుందని ఎద్దేవా చేశారు.
'బంగారు తెలంగాణ కాదు.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైంది'
Tarun chug fire on KCR: తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ దూసుకెళ్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను వద్దనుకుంటున్నారని, ఇక కేసీఆర్ అవినీతి పాలనకు బైబై చెప్పబోతున్నారన్నారు.
bjp
Last Updated : Dec 16, 2022, 7:21 PM IST