BJP Incharge Tarun Chugh: కొందరు నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వేధిస్తున్నారని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ ఆరోపించారు. తీన్మార్ మల్లన్నను ప్రభుత్వం వేధింపులకు గురిచేసిందని ఆయన గుర్తు చేశారు. బండి సంజయ్‌ను గ్యాంగ్‌స్టర్ మాదిరిగా అరెస్టు చేశారని విమర్శించారు. కొందరు పోలీసులు ఖాకీ దుస్తుల బదులు గులాబీ కండువాలు కప్పుకున్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టే పోలీసులు ఇది బ్రిటిష్ పాలన కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
Tarun chugh fire on trs: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో కోర్టులో మాకు న్యాయం జరిగిందని తరుణ్‌చుగ్ వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. భాజపా కార్యకర్తలను ఎంతమందినైనా జైలులో పెట్టుకోండని సీఎం కేసీఆర్‌కు తరుణ్‌చుగ్ సవాల్ విసిరారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకముందని పేర్కొన్నారు. కుటుంబ పాలనపై చేసిన వ్యాఖ్యల పట్ల తాము ఇప్పటికి కట్టుబడి ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడేందుకు భాజపా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు.
'బండి సంజయ్‌పై తప్పుడు కేసులు పెట్టారు. ఈ విషయంలో కోర్టులో మాకు న్యాయం జరిగింది. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోంది. కేసీఆర్ నివాసాన్ని రాజప్రసాదంలా భావిస్తున్నారు. కేసీఆర్ సాబ్ ఎంతమందినైనా జైలులో పెట్టుకోండి. సంజయ్ విషయంలో పార్టీ పోరాడుతూనే ఉంటుంది. టీచర్లు, విద్యార్థుల హక్కుల కోసం మా పోరాటం ఆగదు. న్యాయవ్యవస్థపై మాకు పూర్తి విశ్వాసం ఉంది.'-తరుణ్‌చుగ్, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్