BJP Telangana Election Committees 2023 :రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఈసారి రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దె దించి కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. బీఆర్ఎస్(BRS)ను దీటుగా ఎదుర్కొని.. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ(BJP Party) పావులు కదుపుతోంది. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం ఛైర్మన్, కన్వీనర్‌లతో పాటు 14 కమిటీలనుబీజేపీ నియమించింది.
BJP Special Committees For Telangana Election 2023 :ప్రజా సమావేశాల కమిటీ ఛైర్మన్‌గా బండి సంజయ్, మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్ కమిటీ ఛైర్మన్‌గా పి.మురళీధర్‌రావు, మీడియా కమిటీ ఛైర్మన్‌గా రఘువర్ధన్ ఇలా 14 విభాగాల్లో పార్టీలోని నిష్ణాతులైన నాయకులను పార్టీ నియామకాలు చేపట్టింది. స్కీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పోరాటాల కమిటీ ఛైర్ పర్సన్‌గా విజయశాంతి, సోషల్ మీడియా కమిటీ ఛైర్మన్‌గా ఎంపీ అర్వింద్, ఎలక్షన్ కమిషన్ సమస్యల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలను మర్రి శశిధర్‌రెడ్డికి అప్పగించారు.
BJP 14 Special Committees For Telangana Assembly Election : హెడ్‌క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనారెడ్డి, ఇన్‌ఫ్లూఎన్సర్ అవుట్‌రిచ్ ఛైర్ పర్సన్‌గా డీకే.అరుణ, సోషల్ అవుట్‌రిచ్ ఛైర్ పర్సన్‌గా కోవ లక్ష్మి, కంపైన్ ఇష్యూల, టాకింగ్ పాయింట్ల కమిటీ ఛైర్మన్‌గా వెదిరె శ్రీరామ్, ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా జితేందర్ రెడ్డి, ఎస్టీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్‌రావులు నియమితులయ్యారు.