రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అంశాన్ని ఇప్పటికీ ఎందుకు బహిర్గతం చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన విధంగా కేంద్రం చేసిన సవరణలను అడ్డుకునేందుకు... మజ్లిస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం పురపాలిక ఎన్నికల నిబంధనలను ఎత్తివేశారని ఆయన ప్రశ్నించారు. ఏ మాత్రం గడువు లేకుండా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను హడావుడిగా ప్రకటించారని దుయ్యబట్టారు. ఈ నెల 30న సీఏఏపై... హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్‌లలో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని... ప్రజల దగ్గరికి వెళ్లి సీఏఏపై వివరిస్తామని లక్ష్మణ్ తెలిపారు.
మజ్లిస్‌తో కలిసి కేసీఆర్ కుట్ర: లక్ష్మణ్ - ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శలు
ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లిస్ పార్టీతో కలిసి కుట్రలు చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
![మజ్లిస్‌తో కలిసి కేసీఆర్ కుట్ర: లక్ష్మణ్ bjp laxman](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5511426-thumbnail-3x2-laxman-rk.jpg)
'ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల నిబంధనలు ఎత్తివేశారు..?'
'ఎవరి ప్రయోజనాల కోసం ఎన్నికల నిబంధనలు ఎత్తివేశారు..?'