భాజపాపై కేవలం పదివేల ఓట్ల మెజార్టీ మాత్రమే సాధించడమంటే ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తికి అద్దంపడుతోందని భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ భాజపాదేనని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నట్లు స్పష్టమవుతోందని తెలిపారు.
మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సొంత గ్రామం సహా నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు గుప్పించినా... మంత్రులు ప్రచారం చేసిన చోట భాజపా అధిక్యం సాధించడం చూస్తే తెరాస పట్ల ప్రజలకున్న అపనమ్మకాన్ని తెలుపుతుందని వివరించారు. అసెంబ్లీని, అధికారాన్ని ఉపయోగించినా స్వల్ప మెజారిటీతో తెరాస సాంకేతికంగా విజయం సాధించినప్పటికీ, నైతిక విజయం మాత్రం భాజపాదేనని తెలిపారు.