తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వంపై వ్యతిరేకతే మా గెలుపునకు నాంది: బండ జయసుధారెడ్డి - గ్రేటర్ ఎన్నికల ప్రచారం 2020

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాజపా అభ్యర్థుల జోరు కొనసాగిస్తున్నారు. తార్నాక డివిజన్​ అభ్యర్థి బండ జయసుధారెడ్డి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

BJP tarnaka division candidate election compaign in ghmc
ప్రభుత్వంపై వ్యతిరేకతే మా గెలుపునకు నాంది: బండ జయసుధరెడ్డి

By

Published : Nov 29, 2020, 4:45 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తార్నాక డివిజన్​ అభ్యర్థి బండ జయసుధారెడ్డి ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. డివిజన్​ పరిధిలోని మాణికేశ్వరనగర్, ఓయూ ప్రాంతాల్లో పర్యటించారు.

ప్రభుత్వంపై వ్యతిరేకతే మా గెలుపునకు నాంది: బండ జయసుధరెడ్డి

తెరాస ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని ఆమె అన్నారు. గ్రేటర్​లో భాజపాను గెలిపిస్తే ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎవరిని పలకరించినా భాజపాదే విజయం అంటున్నారని జయసుధారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:సచివాలయం లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి: కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details