జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా భాజపా ప్రచారం విస్తృతం చేసింది. డివిజన్లలో గడపగడపకూ వెళ్తున్న అభ్యర్థులు... ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మెహదీపట్నం సంతోష్‌నగర్ కాలనీలో ఆపార్టీ అభ్యర్థి గోపాలకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఆసిఫ్‌నగర్ డివిజన్ అభ్యర్థి లావణ్య ఓటర్ల చెంతకు వెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వివరించి ఓట్లడిగారు.
పీఠమే లక్ష్యంగా.. భాజపా ఇంటింటి ప్రచారం - తెలంగాణ పాలిటికల్ వార్తలు
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠమే లక్ష్యంగా భాజపా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
![పీఠమే లక్ష్యంగా.. భాజపా ఇంటింటి ప్రచారం bjp campaign in ghmc elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9669821-82-9669821-1606372843878.jpg)
పీఠమే లక్ష్యంగా.. భాజపా ఇంటింటి ప్రచారం