తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్​ తక్షణమే రాజీనామా చేయాలి: లక్ష్మణ్​ - bjp stete president laxman demand for cm resign in hyderabad

ముఖ్యమంత్రి కేసీఆర్​ తక్షణమే రాజీనామా చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ డిమాండ్​ చేశారు.  ఆర్టీసీ కార్మికులకు మూడు సార్లు గడువు విధించినా... మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరినా కార్మికులు విధుల్లో చేరకుండా నైతిక విజయం సాధించారని ఆయన తెలిపారు.

కె.లక్ష్మణ్

By

Published : Nov 6, 2019, 4:38 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు మూడు సార్లు గడువు విధించినా... మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి బతిమిలాడినా.... 3 వందలకు మించి ఉద్యోగులు విధుల్లో చేరలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ బెదిరింపులను తిరస్కరించి కార్మికులు ఒక్క శాతం కూడా విధుల్లో చేరకుండా నైతికంగా విజయం సాధించారన్నారు. సుమారు 48 వేల మంది కార్మికుల తిరస్కరణకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన మిలియన్ మార్చ్​తోపాటు భవిష్యత్ పోరాటాల్లోనూ భాజపా పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె అంశాన్ని నడ్డా, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. కేసీఆర్​కు ఆర్టీసీ అస్తుల మీద ఉన్న ప్రేమ కార్మికుల మీద లేదన్నారు. 2018 నూతన మోటార్ వాహనాల చట్టాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని... అందుకు అనుగుణంగా ప్రైవేటీకరణ చేస్తామనడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు.

సీఎం తక్షణమే రాజీనామా చేయాలి: లక్ష్మణ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details