NVSS Prabhakar: రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తెరాస ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. నిజానికి ప్రజా ధిక్కారానికి పాల్పడుతున్నది సీఎం కేసీఆరేనని విమర్శించారు. నిరుద్యోగ, దళిత, బీసీల ద్రోహిగా.. కేసీఆర్ను ప్రజల ముందు నిలబెడతామన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ప్రజలకు కన్నీళ్లే మిగిలాయని విమర్శించారు.
'కేసీఆర్ ప్రభుత్వం.. తెలంగాణ, దళిత, నిరుద్యోగ, రైతు ద్రోహిగా మారింది. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో జనం ఏడుస్తూనే ఉన్నారు. ప్రజలెవరూ సంతోషంగా లేరు. కేసీఆర్ పర్యటిస్తున్నారంటే.. ప్రజలు, రైతులను ఆదుకుంటారని.. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఇస్తారని అనుకుంటాం. కానీ ఏడేళ్ల కాలంలో మంత్రుల ఆస్తులను పెంచుకోవడం, కార్యాలయాల్లో అంతస్తులను పెంచుకోవడమే ఈ ప్రభుత్వ ఘనతగా మారింది.'