NVSS ON CM KCR: ఎనిమిదేళ్లలో చెరువులు అక్రమించి.. అక్రమ లేఅవుట్లు వేశారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. అందువల్లే భాగ్యనగరం ఐదారు రోజులుగా వరద నీటితో అతలాకుతలమైందని విమర్శించారు. మూసీతో పాటు అనేక చెరువుల వరదతో పలు కాలనీలు మోకాళ్లలోతులో ఉన్నాయన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
ఐదారు రోజులుగా భాగ్యనగరం అతలాకుతలమైంది. మూసీ, అనేక చెరువుల వల్ల కాలనీలు మోకాళ్ల లోతు నీళ్లలో ఉన్నాయి. పాతబస్తీని ఎనిమిదేళ్లైన ఎందుకు అభివృద్ధి చేయలేదు. హైదరాబాద్‌లో మిషన్ కాకతీయ ఏమైందో సీఎం చెప్పాలి?. ఎనిమిదేళ్లలో చెరువులు అక్రమించి.. అక్రమ లేఅవుట్లు వేశారు.-ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పాతబస్తీని ఎనిమిదేళ్లైన ఎందుకు అభివృద్ధి చేయలేదని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో మిషన్ కాకతీయ ఏమైందో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జలాశయాల రూపు రేఖలు మార్చాలని చూస్తున్నారని ప్రభాకర్ ఆరోపించారు. ఈ ఎనిమిదేళ్లలో నాలుగు సార్లు నగరంలో వరదలు వస్తే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రభుత్వాన్ని విమర్శించారు.