కర్షకుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ సర్కార్ పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. రైతుల సమస్యల పరిష్కరించాలని హైదరాబాద్ రామంతపూర్‌లోని ఆయన నివాసంలో పోరు దీక్ష చేపట్టారు.
'రైతుల నుంచి చివరి గింజ వరకూ కొనుగోలు చేయాలి' - bjp state vice president
రైతుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కర్షకుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
యాసంగి పంటల కొనుగోలు లక్ష్యం 94 లక్షల టన్నులైతే 54 లక్షల టన్నులే కొనుగోలు చేశారని ఎన్వీఎస్ఎస్ చెప్పారు. కర్షకుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారి నుంచి కొన్న ధాన్యానికి చెల్లింపులు జరగలేదని అన్నారు.
- ఇదీ చదవండి:ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌పై విడుదల వాయిదా