తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్‌ఆర్‌సీ, సీఏఏపై అవగాహన అవసరం: లక్ష్మణ్​ - ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో నష్టమేమి లేదు: లక్ష్మణ్​

మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చట్టాలు, బిల్లులు తీసుకొచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో నష్టమేమి లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు భాజపా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

bjp state president speak about CAA, NRC
ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో నష్టమేమి లేదు: లక్ష్మణ్​

By

Published : Dec 30, 2019, 1:48 PM IST

సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్​ ఇందిరాపార్కు వద్ద భాజపా సభ ఏర్పాటు చేసింది. సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, గరికపాటి హాజరయ్యారు. ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో నష్టమేమి లేదని లక్ష్మణ్ అన్నారు. మోదీ ప్రభుత్వం విప్లవాత్మక చట్టాలు, బిల్లులు తీసుకొచ్చిందన్నారు.

మతం రంగు పులుముతున్నాయి

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు కొన్ని పార్టీలు మతం రంగు రుద్దుతున్నాయని విమర్శించారు. మతాలకు అతీతంగా దేశంలోని పౌరులంతా భారతీయులేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులు హింసను ఎదుర్కొంటున్నారని చెప్పారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏతో నష్టమేమి లేదు: లక్ష్మణ్​

ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్

For All Latest Updates

TAGGED:

BJP

ABOUT THE AUTHOR

...view details