ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు నచ్చి భాజపాలో చేరాలనుకునే ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్షపార్టీల ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆ పార్టీలకు చెందిన నేతలు పెద్ద ఎత్తున్న భాజపాలో చేరుతున్నారని తెలిపారు. ప్రజల్లో తెరాస గ్రాఫ్ పడిపోయిందనడానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. భాజపాలో చేరి తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మాజీమంత్రులు, పెద్దిరెడ్డి, బోడ జనార్దన్, మాజీ ఎంపీ చాడ సురేష్‌రెడ్డిలకు పార్టీశ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
'తెలంగాణలో తెరాస గ్రాఫ్ పడిపోయింది' - తెలంగాణ ప్రజల్లో తెరాస గ్రాఫ్ పడిపోయిందన్నారు
తెలంగాణ ప్రజల్లో తెరాస గ్రాఫ్ పడిపోయిందన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్. ఆ పార్టీకి దీటైన ప్రత్యామ్నాయం మేము అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చతికిలపడిందని ఎద్దేవా చేశారు.
'తెలంగాణలో తెరాస గ్రాఫ్ పడిపోయింది'
2023లో జరిగే ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చతికిలపడిందని అన్నారు. ప్రశ్నించేవాడు ఉండకూడదనే కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడని మాజీమంత్రి పెద్దిరెడ్డి ఆరోపించారు. మోదీ నిస్వార్థంతో పనిచేస్తున్నారని అందులో తాము భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే భాజపాలో చేరినట్లు పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : అసెంబ్లీ నిర్మాణంపై విచారణ జులై 8కి వాయిదా