భవిష్యత్లో ఏ తల్లి కడుపు కోతకు మద్యం కారణం కాకూడదని భాజపా రాష్ట్ర అధ్యక్షడు లక్ష్మణ్ అన్నారు. కేంద్రంలో మోదీ 'బేటీ బచావో-బేటీ పడావో' అంటుంటే రాష్ట్రంలో కేసీఆర్ 'బార్ బడావో-బార్ బచావో' అంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు.
మద్యం నియంత్రణ శాఖను.. మద్యం పెంచే శాఖగా మార్చారని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పబ్, క్లబ్ కల్చర్ తల్లిదండ్రుల పాలిట గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ అంటూ ట్వీట్ చేస్తున్న కేటీఆర్.. బ్రాందీ హైదరాబాద్గా మార్చారని మండిపడ్డారు.