ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవును నిజమే.. మీరనుకున్న అభ్యర్థులు మాకు లేరు' - Bjp state president laxman updates

తెరాస నాయకులు మాట్లాడుతున్నట్టు మాకు వాళ్లలాంటి అభ్యర్థులు లేరు. మాకు లిక్కర్ మాఫియా, సాండ్ మాఫియా, ఇతర మాఫియాలకు చెందిన అభ్యర్థులు లేరు. కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులు లేరు. మాకున్నదల్లా దేశానికి సేవ చేసే కార్యకర్తలే మా అభ్యర్థులు.             --- భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్

laxman on muncipal elections
కేటీఆర్​పై మండిపడ్డ లక్ష్మణ్
author img

By

Published : Jan 16, 2020, 4:56 PM IST

Updated : Jan 16, 2020, 5:10 PM IST

మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలమైన కేటీఆర్​ను... పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత అప్పగించడం విడ్డూరంగా ఉందన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో తెరాస పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

కొత్త కొలువులు, నిరుద్యోగ భృతి గురించి చర్చలేదని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీల్లో డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం విస్మరించిందన్నారు. పురపోరులో భాజపాను గెలిపిస్తే.. అసలైన అభివృద్ధి ఎంటో చూపిస్తామన్నారు.

కేటీఆర్​పై మండిపడ్డ లక్ష్మణ్

ఇవీ చూడండి: 'పుర'లొల్లి: మంత్రి మల్లారెడ్డిపై 'పైసల' ఆరోపణలు!

Last Updated : Jan 16, 2020, 5:10 PM IST

ABOUT THE AUTHOR

...view details