తెలంగాణ

telangana

ETV Bharat / state

'పౌరసత్వ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు' - గర్ గర్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం

పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రజల్లో అవగాహన కల్పించడానికై ముషీరాబాద్​లో భాజపా నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. ప్రజల్లో అపోహలు దూరం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పేర్కొన్నారు.

bjp state president laxman in ghar ghar sampark abhiyan program in mushirabad
'పౌరసత్వ బిల్లుపై ప్రజల్లో తెరాస అపోహలు సృష్టిస్తోంది'

By

Published : Jan 28, 2020, 4:43 PM IST

రాష్ట్రంలో తెరాస పార్టీ ఎంఐఎంతో కలిసి పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఈ దుష్ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు.

'పౌరసత్వ బిల్లుపై ప్రజల్లో తెరాస అపోహలు సృష్టిస్తోంది'
గర్ గర్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​లోని ముషీరాబాద్​లో భాజపా నాయకులు ఇంటింటికి వెళ్లి పౌరసత్వ బిల్లుపై అవగాహన కల్పించారు. దేశ సమైక్యత సమగ్రతకు భంగం కలిగేలా తెరాస వ్యవహరిస్తోందని లక్ష్మణ్ ఆరోపించారు. పౌరసత్వ బిల్లులపై జాతీయ వాదులను ఐక్యం చేసి... ప్రజల సమగ్రత కోసం తమ వంతు కృషి చేస్తామని లక్ష్మణ్ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details