టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో ధర్నాచౌక్ వద్ద చేస్తున్న రిలేనిరాహార దీక్షకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. 2017లో ఎంపికైన 8,792 మంది అభ్యర్థులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. విద్యార్థులు లేరు అనే నెపంతో పాఠశాలలు మూసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు మాత్రం భర్తీ చేయట్లేదని లక్ష్మణ్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. నా బిడ్డలు బాగుంటే చాలని, రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదనుకుంటారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ... విద్యార్థుల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని లక్ష్మణ్ వెల్లడించారు.
'నీ బిడ్డలు బాగుంటే చాలా? పేదలు ఏమైనా పట్టదా?' - TRT
ప్రభుత్వ పాఠశాలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు లేక విద్యార్థులు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉంది. అయినా ప్రభుత్వానికేం పట్టదు. నోటిఫికేషన్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అవి తప్పుల తడకలే ఇదీ సర్కారు పరిస్థితి: లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
'నీ బిడ్డలు బాగుంటే చాలా? పేదలు ఏమైనా పట్టదా?'