తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓవైసీతో కలిసి​ ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదు' - జాతీయ జనాభా పట్టిక సవరణ

ఎన్​పీఆర్​ సవరణను అడ్డుకుంటూ ఓవైసీతో కలిసి సీఎం కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ ​ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం పురపాలిక ఎన్నికల నిబంధనలు ఎత్తివేశారని ప్రశ్నించారు.

'ఓవైసీతో కలిసి​ ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదు'
'ఓవైసీతో కలిసి​ ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదు'

By

Published : Dec 27, 2019, 2:56 PM IST

దేశహితం కోసం చేసిన జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్)​ సవరణను అడ్డుకుంటూ... ఓవైసీతో కలిసి కేసీఆర్​ ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే అంశాన్ని ఇప్పటికీ ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు. ప్రజలకు అవసరమైన విధంగా కేంద్రం చేసిన సవరణలను అడ్డుకునేందుకు... మజ్లిస్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి ప్రయోజనాల కోసం పురపాలిక ఎన్నికల నిబంధనలను ఎత్తివేశారని లక్ష్మణ్​ నిలదీశారు.

'ఓవైసీతో కలిసి​ ప్రజలను రెచ్చగొట్టడం సరైంది కాదు'

ABOUT THE AUTHOR

...view details