హైదరాబాద్ భాజపా కార్యాలయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెరాస పాలనపై మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పోస్టులు దక్కాయి కానీ, రాష్ట్రంలో నిరుద్యోగులు అలాగే మిగిలిపోయారని విమర్శించారు. ఉద్యోగులకు మధ్యంతర భృతి మరిచి... ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ఉద్యోగ సంఘాల నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులు బలౌతున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకుంటే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని అయన హెచ్చరించారు.
'మార్చి 15న హైదరాబాద్‌లో అమిత్ షా నాయకత్వంలో సీఏఏ అనుకూల సభ' - Laxman Fire on Kcr Family
సీఎం కేసీఆర్ ఎన్నికల తర్వాత మాటమార్చి ఉద్యోగులను మోసం చేశారని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఆరేళ్లలో 50 వేలకు పైగా ఖాళీలు ఏర్పడితే 20 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబంలో అందరికీ పోస్టులు దక్కాయి కానీ, నిరుద్యోగులు అలాగే మిగిలిపోయారని ఆరోపించారు. సీఏఏపై అనుమానాలు నివృత్తి చేసేందుకు వచ్చేనెల 15న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. దీనికి అమిత్ షా హాజరుకానున్నారు.

'కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు'
మార్చి 15న హైదరాబాద్‌లో సీఏఏకు అనుకూలంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతారన్నారు. తమ మిత్రపక్షమైన జనసేన నేత పవన్ కల్యాణ్‌ను ఈ సభకు ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు.
'కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవ్వరికీ ఉద్యోగం రాలేదు'
ఇవీ చూడండి:మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్ సేవలు ప్రారంభం